ఏపీలో 62 మంది జడ్జిలను బదిలీ చేసిన హైకోర్టు

  • ఇతర జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు బదిలీ
  • ఆగస్టు 3లోగా కొత్త న్యాయస్థానాల్లో చేరాలని ఆదేశం
  • ఈలోగా పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఉత్తర్వులు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉన్న జడ్జిలను ఇతర జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం జరిగింది. ఒకేసారి ఇంతమంది జడ్జిలను బదిలీ చేయడం విశేషం. బదిలీ అయిన వారంతా ఆగస్టు 3లోగా తమ కొత్త న్యాయస్థానాల్లో చేరాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఈలోపల పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మూడు రోజుల క్రితమే 68 జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. నేరుగా నియామకం ద్వారా 55 మంది జడ్జిలను, బదిలీల ద్వారా 13 మందిని నియమించనున్నారు.

Andhra Pradesh
Junior Civil Judges
Transfer
AP High Court

More Telugu News